English   

కాశ్మీర్ బాట పట్టిన మామా అల్లుళ్ళు

venkymama
2019-05-12 07:50:32

విక్ట‌రీ వెంక‌టేష్, నాగ‌చైత‌న్య హీరోలుగా జై లవ కుశ ఫేం బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మల్టీ స్టారర్ వెంకీ మామ‌. ఈ మధ్య రెండి షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మూడో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటుందట. ఎటూ భీబత్సమైన ఎండలు చంపుకు తినడంతో ఈ సినిమాలో కీలకమైన మూడ‌వ షెడ్యూల్ ను క‌శ్మీర్ లో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. క‌శ్మీర్ లోని ఇండియా-పాకిస్తాన్ స‌రిహ‌ద్దు ప్రాంతం వ‌ద్ద కొన్ని కీల‌కమైన సీన్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మామ‌- అల్లుళ్ల‌ మధ్య కామెడీ ట్రాక్ నడిపిస్తూనే టెర్రరిజం నేపధ్యాన్ని కూడా ఈ సినిమాలో బాబీ చూపించనున్నాడని అంటున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్న చైతన్యకు సంబందించే ఈ షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. అయితే మొట్టమొదటి సారి మామ అల్లుడు క‌లిసి న‌టిస్తోన్న లెంగ్త్ మూవీ కావ‌డంతో సినిమా పై అభిమానుల్లో మంచి అంచ‌నాలున్నాయి. ఇందులో వెంకీకి జోడీగా ఆర్ ఎక్స్-100 భామ పాయ‌ల్ రాజ్ పుత్, చైతన్యకి జంటగా  రాశీఖ‌న్నా న‌టిస్తోంది. 

More Related Stories