English   

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మేనేజర్ కోసం సమర్పించుకుంటున్న కాజల్

kajal
2019-05-12 09:48:44

డ్రగ్స్ కేసులో కాజల్ మేనేజర్ రోనీ అరెస్ట్....రెండేళ్ళ క్రితం టాలీవుడ్ లో కలకం రేపిన డ్రగ్స్ కేసులో ప్రధానంగా వినిపించిన వార్త ఇది. చాలా కాలంగా అతడు డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియడంతో సోదాలు చేసిన పోలీసులకు రోనీ ఇంట్లో గంజాయి దొరకడంతో అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో స్పందించిన కాజల్ అతను తనకు మేనేజర్ కాదని స్నేహితుడు అంటూ ఏదో చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ కేస్ ఏమైంది అనేది ఎవరికీ తెలియదు కానీ ఇన్నాళ్ల తర్వాత కాజల్ మేనేజర్ రోనీ తన స్క్రీన్ నేమ్ ను రాన్సన్ జోసెఫ్ గా మార్చుకొని నిర్మాతగా మారిపోయాడు. ఇప్పుడు ఈయన చేతిలో దాదాపు మూడు ప్రొజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఆయన సడన్ గా రాన్సన్ గా మారడం, నిర్మాతగా సినిమాలు మొదలెట్టడం పెద్ద విశేషం కాదు. కానీ నిన్న రాన్సన్ నిర్మాణంలో మొదలైన ఒక సినిమా ప్రారంభోత్సవానికీ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిధిగా రావడమే కాక ఆ సినిమాకి సమర్పకురాలిగానూ వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి కథానాయకుడిగా రెండో సినిమానే రాన్సన్ నిర్మాణంలో మొదలయ్యింది.  వీర, ధోని, ఉలవచారు బిర్యాని, ఆర్‌ఎక్స్‌ 100 లాంటి సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన భరత్‌ కుమార్‌ పెద‌గాని దర్శకత్వంలో ఈ సినిమా మొదలు కానుంది. యాపిల్‌ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్న హైదరాబాద్‌లో జరిగాయి. అగర్వాల్‌ క్లాప్‌ కొట్టగా ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఇక ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ప్రముఖ డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ, ప్రముఖ ప్రొడ్యూసర్‌ సాహు గారపాటి సినిమా స్క్రిప్ట్‌ను మనుచరిత్ర దర్శకుడు భరత్‌ కుమార్‌కు అందించారు.

More Related Stories