English   

ప్రయోగం చేస్తున్న తేజ్ -మారుతి

sai
2019-05-12 10:03:51

వరుసగా రెండేళ్లలో ఆరు భారీ డిజాస్టర్లు అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు ఎట్టకేలకు 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ దొరికింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ ఏది ఏప్రిల్ 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే వసూలు చేసింది. ఈ సినిమా కోసం న్యూమరాలజీ ప్రకారం సాయిధరమ్ తేజ్ తన పేరును సాయి తేజగా మార్చుకున్నాడు తేజ్. ఇక చిత్రలహరి సినిమా తర్వాత తాజాగా సాయి తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. శైలజ రెడ్డి అల్లుడు సినిమా డిజాస్టర్ కావడంతో మారుతి చాలా ఎక్కువ ద్రుష్టి పెట్టి మరీ ఈ కధ రాసుకున్నాడని అంటున్నారు. అయితే ఇది మారుతి జోనర్ లా కామెడీమ్ లేదా రోమాన్స్ కి పరిమితం కాదని మాస్ మసాలా అంశాలు ఏమీ లేకుండా ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే మారుతి ఇప్పటి వరకూ ఇలాంటి జానర్ చేయలేదు.

మరి ఆయన ఈ జానర్ తో ఎలా ఆకట్టుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమాలో తేజ్ తండ్రి పాత్ర చాలా కీలకంగా నిలుస్తుందట. అందువలన ఈ పాత్ర కోసం రావు రమేశ్ ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే రూపొందిన సంగతి తెలిసిందే. ఇక తేజ్ కి ఎటూ గీతా ఆర్ట్స్ అంటే సొంత సంస్థ లాంటిదే. కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా మీద త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని అంటున్నారు.

More Related Stories