English   

అవునా నా లవర్ పేరు చెప్పరా ప్లీజ్ ?

rajesh
2019-05-12 10:38:15

పదహారణాల తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్‌. తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నటిగా రంగప్రవేశం చేసింది. అయితే మొదట్లో ఈమెకి హీరోయిన్‌ గా మంచి అవకాశాలు రాకపోయినా, నటిగా తనేమిటో నిరూపించుకోవాలని భావించిన ఆమె కాక్కముట్టై సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో ఏ హీరోయిన్‌ చేయనటువంటి సాహసం చేసి నటించారు ఐశ్వర్య. ఈ సినిమా దెబ్బకు ఇప్పుడు హీరోయిన్‌గా ఐశ్వర్యారాజేశ్‌ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మాతృభాష తెలుగులోకి ఎంట్రీ కూడా ఇచ్చి కొన్ని సినిమాలు చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె త్వరలో పెళ్ళికి సిద్దమయ్యింది అనే వార్త హల్చల్ చేస్తోంది.

ఏకంగా తన సినిమాలో సహ నటుడి పాత్ర పోషించిన వ్యక్తితో ఆమె డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతుండడంతో నా ప్రియుడు ఎవరో కాస్త చెప్పండి అని ట్వీట్‌ చేసి కలకలం రేపింది ఈ భామ. నా ప్రేమ కథ గురించి కొన్ని గాసిప్స్ విన్నానని దయచేసి నా ప్రియుడు ఎవరో కాస్త చెబుతారా తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉందని ఈమె ట్వీట్ చేసింది. ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం దయచేసి ఆపండి. ఏదైనా జరిగితే ముందు నేనే మీకు చెబుతా. నేను సింగిల్‌గా సంతోషంగా ఉన్నానని ఆమె ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఐశ్వర్య వయసు 29 ఏళ్లు అందుకే ఆమె పెళ్లికి రెడీ అనే ప్రచారం జరుగుతోంది.  

More Related Stories