English   

బంపర్ ఆఫర్ కొట్టేసిన అమలా పాల్

paul
2019-05-12 11:08:21

నటి అమలాపాల్‌ మరో మంచి ఛాన్స్ కొట్టేసింది. ఇండియాలోనే వన్నాఫ్ ది మోస్ట్ ట్యాలెంటెట్ డైర‌క్ట‌ర్‌ లలో ఒక‌రయిన  మ‌ర‌ణిర‌త్నం పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా తెరెకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను భారీ స్టార్ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో తెరెకెక్కిస్తున్నాడు. నిజానికి నాటి దివంగత ముఖ్యమంత్రి, మక్కళ్‌ తిలగం ఎంజీఆర్‌ వంటి నటుడే నటించాలని కలలు కన్న చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. ఇంతకుముందు మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేసి బడ్జెట్‌ వర్కౌట్‌ కాకపోవడంతో తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. గతంలో తమిళ నటుడు విజయ్, తెలుగు నటుడు మహేశ్‌బాబు వంటి స్టార్స్‌తో పొన్నియన్‌సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించిన మణిరత్నం ఈ సారి  విక్రమ్, జయంరవి, కార్తీ, కీర్తీసురేశ్, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ వంటి స్టార్స్‌ను తన సినిమాలో నటించేదుకు ఒప్పించుకున్నారు. అయితే ఇందులో నయనతార కూడా ఒక కీలక పాత్రను పోషించనుందనే ప్రచారం జరిగినా ఆమె కాల్‌షీట్స్‌ కేటాయించలేని కారణంగా అనుష్క ఆ పాత్రను చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో కీలక పాత్ర కోసం మలయాళ బ్యూటీ అమలా పాల్ ను తీసుకున్నారని సమాచారం. అంతటి స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలో నటించడం అంటే బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇక పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

More Related Stories