English   

ఆరోజున అయినా మోక్షం లభించేనా ?

vishal
2019-05-12 11:40:33

తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరీ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటిదాకా ఫ్లాప్స్ తో సతమతం అయిన ఎన్టీఆర్ కి ఈ సినిమా పెద్ద రిలీఫ్. అంత బాగా ఆడింది కాబట్టే ఈ సినిమా బాలీవుడ్ లో సింబా పేరుతో రీమేక్ అయి అక్కడా సూపర్ హిట్ అయింది. ఇక తాజాగా విశాల్ హీరోగా తమిళ్ లో కూడా తెరకెక్కి రిలీజ్ కి రెడీ అయింది. అయోగ్య‌ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమాకి మురుగదాస్ శిష్యుడు వెంకట్‌ మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో విశాల్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తుంది. ఏప్రిల్ 19న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మొద‌ట వార్త‌లు వ‌చ్చాయి. కాని ఈ చిత్రం వాయిదా పడి మే 10న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఆరోజు కూడా వాయిదా పడి ఈ నెల 18న రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఆరోజు కూడా రిలీజ్ అవుతుందన్న నమ్మకం లేదని అంటున్నారు. ఇంతకు ముందే ఈ సినిమా రిలీజ్ వ్యవహరం మీద స్పందించిన విశాల్ ఈ సినిమా రిలీజ్ కోసం నేను చేయాల్సిందంతా చేశాను. న‌టుడిగా చేయాల్సిన దాని క‌న్నా ఎక్కువే చేశాను. అయినా స‌రిపోలేదు. ఏదో ఒక రోజు మంచి టైం వ‌స్తుంది. ఆ రోజు నా ప్ర‌యాణం కొన‌సాగిస్తాను అని పేర్కొన్నాడు. మరి ఆరోజున అయినా ఈ సినిమాకి మోక్షం లభిస్తుందో లేదో చూడాలి ?

 

More Related Stories