English   

అర్జున్ రెడ్డితో మళ్ళీ నటించనున్న ప్రీతి

vijay
2019-05-12 12:26:45

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ, ఆ సినిమాలో ఆయనతో నటించిన ప్రీతీ అదేనండీ శాలిని పాండే కి మాత్రం అనుకున్న మేర అవకాశాలు అందలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే జంట మ‌రోసారి సంద‌డి చేసేందుకు సిద్ద‌మైందని అంటున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న విజ‌య్ దేవ‌రకొండ త్వ‌ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొంద‌నుంద‌ట‌. ఈ సినిమాకి హీరో అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. అలాగే పేటా ఫేం మాళ‌విక మోహ‌న‌న్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంద‌ట‌. విజ‌య్- షాలిని కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా అనే స‌రికి, ఈ సినిమా మీద సినీ వర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్టు సమాచారం.

More Related Stories