English   

కలాం బయోపిక్ మీద అఫీషియల్ ప్రకటన

official announcement comes on abdul kalam biopic
2019-05-12 13:02:22

ప్రస్తుతం అన్ని బాషలలో బ‌యోపిక్‌ ల హవా ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని బాషలలో బ‌యోపిక్ ల‌కి మంచి క్రేజ్ ఉండడంతో వివిధ రంగాల‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ ని తెర‌కెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బ‌యోపిక్ రూపొందించేందుకు బాలీవుడ్‌లో స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా వాటిని ధృవీకరిస్తూ అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని త‌మ సంస్థ‌లో రూపొందించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర, అనిల్ సుంకర, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని రూపొందించ‌నున్న‌ట్టు సమాచారం. క‌లాం పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అనీల్ క‌పూర్ న‌టిస్తార‌ని టాక్‌. ఇటీవ‌ల అనీల్ క‌పూర్‌ని క‌లిసిన మేకర్స్ సినిమా స్క్రిప్ట్ వినిపించ‌గా, అది ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో అబ్ధుల్ క‌లాం బయోపిక్‌లో న‌టించేందుకు ఆయన వెనతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వ‌చ్చే ఏడాది నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ లో నటించే నటీనటుల విషయం మీద అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

 

More Related Stories