English   

ఇస్మార్ట్ గా రామ్ పుట్టిన రోజే మొదలు పెడతారట

ram
2019-05-12 17:06:41

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ తొలిసారిగా పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా చేస్తున్నారు. డబుల్ దిమాక్ హైదరాబాదీ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి మార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ షూటింగ్ పూర్తయ్యిందట. మిగిలిన నాలుగు పాటలు చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించిన పూరీ హీరో రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్‌ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం మాత్రం పూరీ వెల్లడించలేదు.

More Related Stories