English   

మహేష్ బాబు, వంశీ పైడిపల్లిలను ఏడ్పించిన నటుడు

guruswamy
2019-05-12 17:27:16

మహర్షి సినిమాలో మహేష్ బాబు, అల్లరి నరేష్ సహా ఏంటో మంది నటీనటులు నటించినా.సెకండాఫ్‌లో వచ్చే ముసలి రైతు పాత్ర సినిమాను ఎమోషనల్ గా కట్టిపడేసేలా చేసింది. మహేష్ -రైతు కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు. ఆ పాత్ర చేసింది కర్నూల్ జిల్లాకి చెందిన గురుస్వామి అనే స్టేజ్ ఆర్టిస్ట్. ఈ మూవీ సక్సెస్ మీట్‌ లో తొలిసారి స్టేజ్‌పై మాట్లాడిన గురుస్వామి కళ్లు చెమర్చేలా ప్రసంగిచారు. ఆయన స్పీచ్‌‌కి దర్శకుడు వంశీపైడిపల్లి స్టేజ్‌పైనే కళ్లనీళ్లు పెట్టుకోకా.. ఎమోషన్ అయిన మహేష్ బాబు.. గరుస్వామిని ఆలింగనం చేసుకున్నారు. తప్పటడుగులు వేస్తున్న పిల్లివాడిని ఎలా చేయిపట్టుకుని నడిపిస్తారో మహర్షి సినిమాలో ఏమీ తెలియని నన్ను అలా నడిపించారనీ ఈ సినిమాతో ఈ జీవితం ధన్యం అయ్యిందని దర్శకుడు వంశీ పైడిపల్లికి యూనిట్‌కి జీవితాంతం రుణ పడి ఉంటానని ఆయన చెప్పుకొచ్చాడు.

తాను ఒక కూలీ కొడుకునని నాన్న కష్టపడి చదివిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలిగానని అయినా చుట్టుముట్టిన ఆర్ధిక ఇబ్బందులను మరిచిపోవడానికి యాక్టింగ్ వైపు ద్రిస్టి పెట్టి కర్నూల్‌లో స్టేజ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్న సమయంలో కుర్రాళ్ళు చేసే లఘు చిత్రాల్లోనూ నటించగా అలా ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్‌లో నన్ను చూసి దర్శకుడు వంశీపైడిపల్లి నన్ను పిలిచి అవకాశం ఇచ్చారనీ ఇదంతా దైవ సంకల్పం అని ఆయన చెప్పుకొచ్చాడు. గురుస్వామి ఎమోషనల్ స్పీచ్‌కి లేచి వెళ్లి ఆయన్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. వెంటనే స్టేజ్ మీదే ఉన్న మహేష్ బాబు, నరేష్‌లు సైతం లేచి నిలబడ్డారు. 

More Related Stories