English   

మంచు విష్ణు నుండి ప్రాణ హాని...వోటర్ మూవీ డైరెక్టర్ సంచలనం

karthik
2019-05-12 17:48:08

హీరో మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నారంటూ, మంచు విష్ణు నుంచి తనకు ప్రాణభయం ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు ఓటర్ చిత్ర దర్శకుడు కార్తీక్ రెడ్డి. ఓటర్ సినిమా విషయంలో జరిగిన ఒక తప్పుడు ఒప్పందాన్ని కారణంగా చూపి తనను విష్ణు మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఇప్పటికే  కార్తీక్ రెడ్డి సినీ దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసిన ఆయన తనకి ఏ హాని జరిగినా దానికి మంచు విష్ణునే కారణమని ఈ సినిమా చేసినందుకు తనకు రెమ్యునరేషన్ వచ్చేదే రూ.20 లక్షలు. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అన్నీ చేస్తేనే రూ.20 లక్షలు ఇస్తారు. అలాంటిది తాను కోటిన్నర పెట్టి ‘అసెంబ్లీ రౌడీ’ రైట్స్ కొని సినిమా ఎలా తీస్తానని ఆయన ప్రశ్నించాడు. పొరపాటున తను నిర్మాతకు వ్యతిరేకంగా మట్లాడానని తర్వాత తప్పు అని రివర్స్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఆయన నన్నేమైనా చేయొచ్చు. నన్నేం చేసినా, నేను కనిపించకుండాపోయినా, నాకేం జరిగినా మంచు విష్ణునే కారణం అని ఆయన అన్నారు. తానొక దర్శకుడిగా, నిర్మాతకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో మంచు విష్ణు చూపించిన చోట సంతకం పెట్టానని కార్తీక్‌రెడ్డి చెప్పారు. నిజానికి అసలు ఓటర్ కు, అసెంబ్లీ రౌడీ సినిమాకి సంబంధమే లేదని అన్నారు. కానీ తననే మోసం చేసి తన మీద కేసు పెట్టి, నిర్మాతలను టార్చర్ పెడుతున్నారని, ఇది ఒక హీరో చేయాల్సిన పనేనా అని ఆయన ప్రశ్నించారు. డబ్బులకు కక్కుర్తిపడి సినిమాను ఆపుకున్న హీరో ప్రపంచంలో ఎవరూ ఉండరని ఆయన పేర్కొన్నారు.

More Related Stories