English   

కాలర్ ఎగరేసిన మహేష్...అంత స్పెషల్ అట

mahesh
2019-05-12 19:23:15

తాజాగా విడుదలయిన మహర్షి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తొలిసారి ఆయన శైలికి భిన్నంగా ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపే ప్రసంగం చేశారు. ‘మహర్షి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో ఈరోజు ఎపిక్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ రిజర్వ్డ్ గా మాట్లాడే మహేష్ ఈరోజు మాత్రం కాలర్ ఎగరేస్తూ నా ఫ్యాన్స్‌తో పాటు ఈరోజు నేను కూడా కాలర్ ఎగరేస్తున్నా అంటూ ఆకట్టుకున్నారు. ఈ మహర్షి సినిమాని  మా అమ్మతో పాటు అందరి తల్లులకు అంకితం ఇస్తున్నానని చెప్పిన మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నా ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ‘మహర్షి’ సినిమా ఉంటుందని వంశీ చెప్పారనీ. అన్నట్టుగానే నా ఫ్యాన్స్ కాలర్ ఎత్తారనీ ఇప్పుడు వారి సంతోషం కోసం నేను కూడా కాలర్ ఎత్తుతున్నానని మహేష్ కాలర్ ఎత్తి అలరించాడు. ఇక ఈ సినిమా వారంలో మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్న్నారు.

More Related Stories