English   

ప్రముఖ నిర్మాత ఆకస్మిక మృతి

producer
2019-05-12 19:40:56

తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన విజయా వాహినీ స్టూడియోస్ అందరికీ సుపరిచితమే, ఈ బ్యానర్ మీద అనేక సినిమాలను నిర్మించారు నాగిరెడ్డి చక్రపాణిలు. తాజాగా నాగిరెడ్డి రెండో కుమారుడు ఆయన నిర్మాణ వారసత్వాన్ని అందుకున్న వెంకట్రామిరెడ్డి ఈరోజు కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగులో భైరవద్వీపం, బృందావనం చిత్రాలను నిర్మించగా తమిళంలో విశాల్, ధనుష్, అజిత్, విజయ్ హీరోలుగా నటించిన ఐదు  సినిమాలకు వెంకట్రామిరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇక విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ‘సంగతమిళన్’ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. దీనికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాక ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఏటా పురస్కారాలను అందిస్తున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకట్రామిరెడ్డి మృతిపై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు. 

More Related Stories