English   

సైరా అలా ఫిక్సయిందా ?

Sye Raa
2019-05-13 08:35:52

సమ్మర్ సీజన్ మహర్షి సినిమాతో పూర్తయినట్టే, ఇంకా 17, 24 న కొన్ని సినిమాలు ఉన్నా అవి మీడియం, చిన్న సినిమాలే. జూన్‌లో కూడా పెద్దగా హడావుడి ఉండదు. ఇక పెద్ద సినిమాలకు ఇక మిగిలిన టార్గెట్ దసరానే. ఇప్పుడు అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా మీద వుంది. ఎందుకంటే దాదాపు రెండున్నరేళ్ళ క్రితం మొదలయిన సైరాకు దసరా కాకపోతే సంక్రాంతే దిక్కు. అయితే ఇప్పటి నుంచే సంక్రాంతి టార్గెట్‌గా బోలెడు సినిమాలు సిద్ధవుతున్నాయి. మహేష్ - అనిల్ రావిపూడి, బన్నీ- త్రివిక్రమ్, సాయితేజ్-మారుతి, నాగార్జున - కళ్యాణ్ కృష్ణ సినిమాలు, అలాగే బాలయ్య బోయపాటి మూవీ, శర్వానంద్ తమిళ్ రీమేక్ ఇలా చాలా చిత్రాలు సంక్రాంతి టార్గెట్ గా సిద్ధవుతున్నాయి. అన్నీ మంచి కాంబినేషన్ ఉన్న సినిమాలే. దీంతో పొరపాటున సైరా కనుక దసరాకు రాకుండా సంక్రాంతికి వస్తే ఈ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు రావాలని సైరా టీం గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే అక్టోబర్ 2ను విడుదల తేదీగా ఎంచుకున్నట్లు తెలిసింది. అదీ కాక బ్రిటిష్ పాల‌కులపై తిరుగుబాటు చేసి భార‌త స్వాతంత్రోధ్యమం కోసం పోరాటం చేసిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా జాతి పిత  గాంధీ జ‌యంతి రోజైన అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట.  

More Related Stories