English   

బాలయ్య సినిమాకి ఆసక్తికర టైటిల్ 

Balakrishna
2019-05-13 08:43:22

నందమూరి బాల‌కృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ముందు బోయపాటితో ప్లాన్ చేసినా ఆ సినిమా కాస్త లేట్ అయ్యేలా కనపడం వలన బాలయ్య రవి కుమార్ సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న ఈ సినిమాలో ఇప్పటికే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్త‌యిందట. బయటకు అయితే రానీయలేదు కానీ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారట. ఈ సినిమాకి రూల‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినిమా యూనిట్ లోని అత్యంత విశ్వసనీయ వ‌ర్గాల నుండి అందుతున్న సమాచారం. దీనికి తోడు సీ కళ్యాణ్ నిర్మాణ సంస్థ కూడా ఫిలిం ఛాంబ‌ర్ లో ఇదే టైటిల్ రిజిస్ట‌ర్ చేసి ఉంచినట్లు స‌మాచారం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో గ‌తంలో తెర‌కెక్కిన `జై సింహ` ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కించి ఘన విజ‌యం సాధించారు. అందుకే బాల‌య్య మ‌రో సారి గ్యాప్ దొరకగానే ర‌వికుమార్ తో రంగంలోకి దించుతున్నారు. ఈ చిత్రాన్ని సి.కె ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక బోయ‌పాటి సినిమా ప‌ట్టాలెక్కేనుంది. ఇక రవి కుమార్ తో  సినిమా ఈ నెల 17న గ్రాండ్ గా లాంచ్ చేయ‌బోతున్నారు. 

More Related Stories