English   

అల్లువారబ్బాయి కోసం నేచురల్ స్టార్ 

Nani
2019-05-13 08:52:23

హిట్ కోసం విక్రమార్క ప్రయత్నం చేస్తున్న మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'. 'అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ' అనే ట్యాగ్‌ లైన్‌ ఉన్న ఈ సినిమాకి సంజీవ్‌ రెడ్డి అనే ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, దేవరకొండ మేనమామ యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యి, సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ ను గ్రాండ్ గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడట. ఈ మధ్య కాలంలో జెర్సీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని వరస సినిమాలతో దూసుకు వెళ్తున్నాడు. 
 

More Related Stories