English   

మన్మధుడు ముందే వచ్చేస్తున్నాడా ?

 Nagarjuna
2019-05-13 10:05:52

నాగార్జున హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. దీంతో ఆయన ఆశలు అన్నీ మన్మధుడు సీక్వెల్ గా వస్తోన్న మన్మధుడు 2 మీదనే ఉన్నాయి. మన్మధుడు సీక్వెల్ సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇక ఈ సినిమాను నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. చిలసౌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. దీంతో ఆయనకు ఈ సినిమా బాద్యతలు అప్పగించాడు నాగ్. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించడంతో పాటు కీలక పాత్రలో సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరియు అనుష్కలు కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంను దసరాకు విడుదల చేసే అవకాశం ఉందని అనుకున్నా అది ముందే రిలీజ్ చేయాలని మేకర్స్ భావ్సితున్నారట. ఎందుకంటే దసరాకు సైరా లాంటి పెద్ద సినిమాలు ఉన్న కారణంగా అప్పుడు విడుదల చేయడం కరెక్ట్ కాదని ఇంకో నెల ముందు ఆగస్టులో చేద్దామంటే సాహో విడుదల ఉన్న కారణంగా ఆ నెల కూడా విడుదల చేయడం మంచిది కాదని అందుకే జులై చివర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ నిర్ణయం తీసుకున్నాక షూట్ అంతా గేరప్ చేశారని అంటున్నారు.

More Related Stories