English   

అప్పుడే తర్వాతి రెండు సినిమాలు లైన్ లో పెట్టేశాడు ?

Ravi Teja
2019-05-13 11:28:42

మాస్ మహారాజా రవితేజ ఫాంలో ఉన్నప్పుడు సంవత్సరంలో మూడు నాలుగు సినిమాలు విడుదల అయ్యేవి కానీ వరుసగా పరాజయాలు చుట్టూ ముట్టడంతో సినిమాల సంఖ్య దారుణంగా తగ్గించాడు. సంవత్సరం పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న రవితేజ మెల్లగా సినిమాలను చేస్తూ వచ్చాడు. తాజాగా ఆయన రెండు సినిమాలు ఒప్పుకున్నట్టు సమాచారం. ప్ర‌స్తుతం ర‌వితేజ వీఐ ఆనంద్ డిస్కో రాజాతో బిజీగా ఉన్నాడు. అది పూర్త‌య్యాక  గోపీచంద్‌ మలినేనితో ఒక చిత్రం ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది. నిజానికి ర‌వితేజ‌కి క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో గోపీచంద్ మ‌లినేని ఒక‌డు. గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించాయి. అలా ఆరేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట.గతంలో రవితేజ - వినాయక్ ల కాంబినేషన్ లో 'కృష్ణ' సినిమా ఘన విజయాన్ని సాధించింది. వీరిద్దరి కాంబోని నల్లమల్ల బుజ్జి నిర్మించబోతుండగా గోపీ చంద్ తో మూవీని మాత్రం ఠాగూర్‌ మ‌ధు నిర్మించ‌బోతున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. 

More Related Stories