English   

ఫలక్ నామా దాస్ ట్రైలర్...ట్రైలరేనా ? ఇది ?

Vishwak Sen
2019-05-13 13:27:26

ఫలక్ నామా దాస్ ట్రైలర్ ఇది చూసినంత సేపూ అసలు అది సినిమా ట్రైలర్ ఏనా ? లేక మన పక్కగల్లీలో పోరగాళ్లు పోట్లాడుకుంటుంటే పొరపాటున ఆ బూతుల్ని మనం వింటున్నామా? అనిపిస్తుంది ఈరోజు కొద్దిసేపటి క్రితం విడుదలైన ‘ఫలక్‌నుమా దాస్’ ట్రైలర్ చూస్తే. రియాలిటీకి దగ్గరగా హైదరాబాద్ గల్లీ గొడవల నేపథ్యంలో ‘ఈనగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగామలై డైరీస్ సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పెళ్లి చూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు.  తాజా ట్రైలర్‌లో కుర్రాళ్ళు తిట్టుకునే బూతులన్నీ పొల్లుపోకుండా చిన్న బీప్ కూడా లేకుండా బండ బూతుల్ని వినిపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన తరుణ్ భాస్కర్ తెలంగాణ యాసలో పలికిస్తున్న బూతులు రియాలిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ కామన్ ఆడియన్స్‌ రిసీవ్ చేసుకోవడం కాస్త ఇబ్బందనే చెప్పాలి. ఇక ఫ్యామిలీస్‌లో కలిసి ఈ సినిమా వెళ్తే ఇక అంతే సంగతులు అన్నట్టుగా ‘ఫలక్‌నుమా దాస్’ ట్రైలర్ ని బోల్డ్‌గా, హింసాత్మకంగా చూపించారు. అంతే కాదు ఈ సినిమాలో రొమాంటిక్ టచ్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు ట్రైలర్ లో చూపారు. మరి సినిమాలో ఇంకెంత రచ్చ చేస్తారో ?

More Related Stories