English   

రజనీ రాజకీయ క్లారిటీ ?

Rajinikanth
2019-05-13 15:39:01

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ గతంలో ఇప్పుడు జరుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌మిళనాడు శాస‌నస‌భ ఎన్నిక‌ల‌లో మాత్రం పోటీకి దిగుతామని ఆయన చెబుతున్నారు. 2021లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, అప్ప‌టి వ‌ర‌కు త‌న పూర్తి ద్రుష్టి సినిమాల మీదే పెట్టి ఆలోపు తన కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటార‌ని అంటున్నారు. ఈ మేరకు రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే తన అభిమాన సంఘం నేతలతో చర్చించారని అంటున్నారు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల బరిలో రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం చేస్తారని ఆయన అభిమానులు ఆశించారు. కానీ రజనీకాంత్ వారి  ఆశలను వమ్ము చేశారు. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టడం చిన్న విషయం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. కానీ 2021 నాటి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పుడు రజనీకాంత్ నయన తారతో కలిసి ఎ.ఆర్‌.మురుగుదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న దర్బార్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2020 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

More Related Stories