English   

టెంపర్ కధ కాపీ అంట ?

Ayogya
2019-05-13 16:34:46

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రం టెంప‌ర్. అప్ప‌టివ‌ర‌కూ వ‌రుస ఫెయిల్యూర్స్ లో ఉన్న ఎన్టీఆర్ కు ఆ సినిమా మంచి ఎన‌ర్జీని ఇచ్చింది.  ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు టెంపర్ తమిళ్ లో అయోగ్య పేరుతో రీమేకై మొన్న రిలీజ్ ఆగిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ తెలుగులో చేసిన పాత్రను తమిళ్ లో పార్తీబన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ లో టెంపర్ కథను తన పాత సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకుని చేశారని పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. పార్తీబన్ స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐశ్వర్య హీరోయిన్ గా 1993లో ఉల్లే వెలియే అనే సినిమా వచ్చింది. ఈ సినిమా లైన్ కూడా టెంపర్ కు కాస్త దగ్గరగానే ఉంటుంది. ఈ సినిమాని అనిల్ కపూర్ హిందీలో మిస్టర్ ఆజాద్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ ఫ్లాపయ్యింది. ఇన్నేళ్ల తర్వాత పార్తీబన్ దీని గురించి గుర్తు చేయడంతో క్రిటిక్స్ తో పాటు నెటిజెన్లు సైతం పోలికలు గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే వక్కంతం వంశీ కథకు స్ఫూర్తి అక్కడ ఉందని అంటున్నారు.  అయితే అప్పట్లో మాత్రం ఈ టెంపర్ సినిమా అయితే కొనకంచి లక్ష్మీ నారాయణ రాసిన ద్వేషించే ప్రియరాలు నుంచి క్లైమాక్స్ తీసుకుని ముందు కొంచెం స్టోరీ పెట్టి తీశారని అన్నారు.  మరి ఈ రెండిట్లో నిజమేదో ?

More Related Stories