English   

చిరంజీవిది కాదట ఆ వ్యాపారం ?

Chiranjeevi
2019-05-13 18:22:16

స్కూల్ బిజినెస్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ చేశాయి. ఈ నేపధ్యంలో శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘చిరంజీవి ఇంటర్‌నేషనల్‌ స్కూల్స్‌ తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని ఆ స్కూల్ సీఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘చిరంజీవి ఇంటర్‌నేషనల్‌ స్కూల్ పేరిట స్థాపించిన సంస్థకు చిరంజీవి, రాంచరణ్‌, నాగబాబుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో ఈ స్కూల్ పేరిట సంస్థను స్థాపించామని మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే చిరంజీవిని గౌరవ ఫౌండర్ గా, రామ్ చరణ్ ను గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబును గౌరవ చైర్మన్ గా నియమించామని స్పష్టం చేశారు. ఈ పాఠశాలకు, మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో పేద ప్రజలకు అత్యున్నత సౌకర్యాలతో ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  

More Related Stories