English   

వచ్చే వారం నాలుగు సినిమాలు రిలీజ్

cinema
2019-05-13 19:43:53

మహర్షి రాకతో తెలుగు ప్రేక్షకులకి ఇండస్ట్రీ వారికీ ఉన్న పెద్ద టెన్షన్ తీరినట్టే. ఇక ఈ వేసవికి రావాలనుకున్న చిన్న సినిమాలు తీరిగ్గా రిలీజ్ అవచ్చు, అయితే ఓకే రోజు నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ మే 17 న నాలుగు సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అల్లు శిరీష్ నటించిన ఎబిసిడి చిత్రంతో పాటు ఎంతవారలైనా, రొమాంటిక్ క్రిమినల్స్, స్వయంవధ అనే సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే వీటితో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా థియేటర్ లు దొరికితే రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మహేష్ బాబు నటించిన మహర్షి ఇంకా మంచి ఫాంలో ఉండడంతో థియేటర్ లు దొరకాక పోవచ్చు. దాంతో నాలుగు కినిమాలిఉ అయితే విడుదలకి రెడీ అయ్యాయి. అల్లు శిరీష్ కు ఇది మళ్ళీ పరీక్షే , ఏబీసీడీ ఏమాత్రం బాగున్నా వేసవి సెలవులు ఉన్నాయి కాబట్ట హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రొమాంటిక్ క్రిమినల్స్ అనే రొమాంటిక్ సినిమా వస్తోంది అది పోటీ కాదు కానీ బిసి కేంద్రాల్లో కలెక్షన్లు రాబట్టచ్చు. ఇక ఎంతవారలైనా, స్వయంవధ అనే సినిమాలు కూడా వస్తున్నాయి కానీ వాటి మీద అంచనాలు అయితే లేవు. 

More Related Stories