English   

కేజీఎఫ్ టీం మంచి స్పీడ్ లో ఉందిగా

kgf
2019-05-13 21:46:27

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్- 1 సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ నాట యష్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వచించిన ఈ సినిమాని   హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిగా కన్నడ,హిందీ, తెలుగు, త‌మిళ బాషలలో పెద్ద ఎత్తున వసూళ్లతో ఆకట్టుకుంది. ఈ సిరీస్ లో భాగంగా వస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూట్ జరుపుకుంతోందట. తాజా షెడ్యూల్స్ వివ‌రాల్ని సినిమా యూనిట్ ఈరోజు ప్రకటించింది. ఈ సినిమా షూట్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో జరుగుతోందట ఈ షెడ్యూల్ త‌ర్వాత మైసూర్ లో షూటింగ్ చేస్తారట. అది పూర్తయ్యాక రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ ఉంటుందట. చివరిగా బళ్ళారి షెడ్యూల్ తో టాకీ పార్ట్ సింహ  భాగం షూట్ పూర్త‌వుతుందట. దాదాపు 80-90శాతం అప్ప‌టికి పూర్త‌వుతుంది అని కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక ఈ భాగంలో బాలీవుడ్ కి చెందిన పలువురు క్రేజీ స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించనున్నారట.  అయితే ఎప్పుడు రిలీజ్ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

 

More Related Stories