English   

వంద కొట్టిన మహర్షి మహేష్ 

maharshi
2019-05-14 07:22:51

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్‌లో 25వ మూవీగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ముగ్గురు అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సుమారు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ నటించగా అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఇంతటి భారీ చిత్రంతో మహేష్ మరో సారి సెంచరీ కొట్టాడు. నిజానికి ఐపీఎల్ సందడి నిన్నటితో ముగిసినా మహర్షి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. గురవారం నాడు విడుదలైనా ఇంకా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనీ ఉంది.  విడుదలైన నాలుగురోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాణ సంస్థల్లో ఒకరైన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మహర్షి వందకోట్ల పోస్టర్‌ని విడుదల చేసింది. 

More Related Stories