English   

ఈసారి బెజవాడలో మహర్షి 

maharshi
2019-05-14 08:40:47

మహేష్ బాబు తన కెరీర్ లో 25వ సినిమా మహర్షితో కలేక్షనల సునామీ సృష్టిస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మే 09 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలు లేకపోవడం వచ్చిన చిన్నా చితకా సినిమలాకీ ఈ సినిమాకీ చాలా గ్యాప్ ఉండడంతో మహర్షికి బాగా కలిసొచ్చే అంశం . ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాల్లో మునిగిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎపిక్ బ్లాక్ బస్టర్ మీట్ అంటూ ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసిన చిత్ర బృందం మరో పెద్ద ఈవెంట్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతల్లో ఒకరైన పివిపి 18వ తారీకుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ డేట్ కే సక్సెస్ మీట్ ను ఏర్పటు చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సారి సక్సెస్ మీట్ అనకుండా ఫ్యాస్ మీట్ అని సంబోదించనున్నారని సమాచారం. విజయవాడలో కృష్ణ నది తీరంలో ఈ ఈవెంట్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఏదేని కారణాల వలన అనుమతి దొరకకపోతే లయోలా కాలేజీ గ్రౌండ్ ని కూడా అనుకుంటున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories