English   

వినాయక్ హీరోగా దిల్ రాజు సినిమా ?

Dil raju
2019-05-14 11:40:48

అఖిల్ సినిమా ఏ నిముషాన చేశారో కానీ ఆనాటి నుండే డైరెక్టర్ వినాయ‌క్ కెరీర్ గ్రాఫ్ నేలను తాకాలని చూస్తోంది. ఒక‌ప్పుడు వినాయ‌క్‌తో సినిమాలు తీసేందుకు క్యూలో నిలబడిన స్టార్ హీరోలు ఇప్పుడు ఆయ‌న కాల్ ఎత్తడానికి కూడా ఆలోచిస్తున్నారు. 2018లో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా కూడా భారీ దెబ్బ వేయడంతో ఆ సినిమా త‌ర్వాత బాల‌య్య సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు. అయితే ఆయన ఇప్పుడు డైరెక్టర్ నుండి హీరోగా మారుతున్నారట. విన‌డానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే. డైరెక్ట‌ర్ శంక‌ర్ దగ్గర అసిస్టెంట్ న‌ర‌సింహ‌రావు అనే ద‌ర్శ‌కుడు గతంలో శరభ అనే సినిమా తీశారు. ఇప్పుడు ఆయన రెడీ చేసిన ఒక  స్క్రిఫ్ట్ నిర్మాత దిల్ రాజుకు నచ్చడంతో ఈ స్క్రిఫ్ట్ వినాయ‌క్‌కు చెప్పించ‌డం, వినాయక్ ఓకే చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయని సమాచారం. ఈ రోజు తిరుప‌తిలో మ‌హ‌ర్షి టీంతో ఉన్న దిల్ రాజు అక్క‌డే ఈ సినిమాపై ఎనౌన్స్‌మెంట్ చేయనున్నాడని అంటున్నారు.  ఇక మరో పక్క రవితేజ హీరోగా  వినాయక్ దర్శకత్వంలో కూడా ఒక కధ ఓకే అయ్యిందట ఈ విషయాన్ని కూడా త్వరలో ఓకే చేస్తారని అంటున్నారు.

More Related Stories