English   

స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ 

Allu Arjun
2019-05-14 12:28:12

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ షూట్ కి వెళ్లనుంది. అయితే ఈ గ్యాప్‌ లో సమ్మర్ వెకేషన్ కి స్విట్జర్లాండ్ వెళ్ళాడు బన్నీ,  హాలీడే ట్రిప్ కోసం తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి స్విట్జ‌ర్లాండ్ వెళ్ళిన బ‌న్నీ, మంచు కొండల ముందున్న ఓ స్టార్ రిసార్ట్ లో బస చేసి అక్కడికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. లైఫ్‌ లో ఎలా ఉండాలి అని అడిగితే వారు హ్యాపీగా ఉండాల‌ని అన్నారంటూ తన పిల్లలను ఉద్దేశిస్తూ ఫోటోల‌కి కామెంట్ పెట్టాడు బ‌న్నీ. ప్ర‌స్తుతం బ‌న్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ సినిమా చేస్తుండ‌గా, 20వ సినిమాని సుకుమార్ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్నాడు. ఆ తర్వాత ఎంసీఏ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలోను బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.  

More Related Stories