English   

రవితేజ తో వినాయక్ దిల్ రాజు ప్రొడక్షన్ ?

 Vinayak
2019-05-14 13:15:44

చాన్నాళ్ళ కోసం హిట్ కోసం ఎదురు చూస్తున్న రవి తేజ తనకు కృష్ణ లాంటి మాస్ హిట్ ఇచ్చిన వీవీ వినాయక్ కి ఓకే చెప్పినట్టు సమాచారం. నిజానికి వినాయక్ ఇప్పుడు ఫాంలో లేడు. ఖైదీ నెం.150 సినిమా చేసి అబ్బుర పరిచిన వినాయక్ ఆ తర్వాత ఇంటిలిజెంట్ చేసి తీవ్రంగా నిరాశ పర్చాడు. దీంతో ఆయన సైలెంట్ అయ్యాడో లేక హీరోలు పట్టించుకోలేదో తెలియదు కానీ ఇప్పటి దాకా ఆయన మరే సినిమా మొదలు పెట్టలేదు. అయితే ఆయన బాలకృష్ణతో ఒక చిత్రం చేయాల్సి ఉన్నా కూడా అది పట్టాలెక్క లేదు. దాంతో రవితేజతో ఒక చిత్రంకు వినాయక్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ కోసం ఒక మాస్ మసాలా స్టోరీ వినాయక్ రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

More Related Stories