English   

తమిళ సినిమా మీద మనసు పడ్డ శర్వా  

Sharwanand
2019-05-14 13:51:15

గతంలో  'కాదల్‌నా సుమ్మా ఇల్లై', 'ఎంగేయుం ఎప్పోదుం' వంటి చిత్రాలలో నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ ప్రస్తుతం తెలుగులో '96' రీమేక్‌, సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో చాలా గ్యాప్‌ తర్వాత ఆయన మళ్లీ తమిళ చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానరు మీద ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారట. అయితే ఈ సినిమాకి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారట. త్వరలోనే సినిమా పేరు, ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నట్లు ప్రభు ప్రకటించారు. ఎస్‌ఆర్‌ ప్రభు ప్రస్తుతం సూర్య హీరోగా 'ఎన్‌జీకే', కార్తి హీరోగా 'ఖైదీ', జ్యోతిక ప్రధాన పాత్రలో ఓ సినిమా, శిబిరాజ్‌, ఆండ్రియా జంటగా నటిస్తున్న మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటిలో ఎన్‌జీకే త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ రిలీజ్‌కు రెడీగా అవుతోంది.

More Related Stories