English   

మరో సారి సంచలనం రేపుతున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు

Drugs Case
2019-05-14 17:38:54

గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకి సంబంధించి మొత్తం 12 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నాలుగు చార్జీషీట్లు దాఖలు చేసింది. మరో 8 కేసుల్లో ఛార్జిషీట్ ను సిట్ దాఖలు చేయనుంది. కాగా, డ్రగ్స్ కేసు విషయమై  ఎక్సైజ్ శాఖ సిట్ మూడు నెలలు విచారణ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోలు, హీరోయిన్స్, దర్శకులు మొత్తం 62 మంది ఉన్నారు. అప్పట్లో వీరి నుంచి గోళ్లు, కేశముల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం  పంపారు. అయితే ఈ చార్జీషీట్లలో ఆ 62 మంది పేర్లు కానరావడం లేదు. కేసులో 62మంది  హీరో  హీరోయిన్స్, దర్శకులున్నారు. ఇప్పటికే దాఖలైన నాలుగు ఛార్జిషీట్ ల్లో టాలీవుడ్ ప్రముఖల పేర్లను చేర్చలేదు. మరి దాఖలు కావాల్సిన షీట్లలో ఏమైనా చేరుస్తుందేమో చూడాలి మరి.సిట్ అధికారులు చార్జీషీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ పైన, ముంబై నుండి హైదరాబాద్ కు కొకైన్ తరలించి విక్రయిస్తున్నాడని 2017లో అరెస్ట్ చేసిన అలెక్స్ ల పేర్లు అయితే ఉన్నాయి.

More Related Stories