English   

వినాయక్ హీరో కాదట...విలన్ అట ?

vinayk
2019-05-14 21:05:38

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా మారుతున్నారని నేటి ఉదయం ఒక వార్త వైరల్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారని ఆ వార్త సారాంశం. ఈ ప్రచారాన్ని రూమర్‌ను నిజం చేస్తూ వి.వి.వినాయక్‌తో ఈ ఉదయం దిల్ రాజు సినిమాను ప్రకటించేశారు. తిరుమల ఏడు కొండల వాడి సాక్షిగా వివరాలను వెల్లడించారు. తనని దిల్ రాజును చేసిన వినాయక్‌ను నటుడిగా మా బ్యానర్‌లో పరిచయం చేయబోతున్నామని మంచి కథ వినయ్‌ కూడా ఒప్పుకున్నాక తిరుమలేశుడి సన్నిధానంలో ఈ సినిమాను ప్రకటించండి అన్నయ్య అని ఆయన కోరాడని అందుకే ఇక్కడ ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో వినాయక్ నటించేది హీరోగా కాదట ఆయన విలన్ గా నటించబోతున్నాడట. మాస్ పల్స్ తెలిసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు దిల్ రాజు సినిమాలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శరభ మూవీ దర్శకుడు నరసింహ రావు తెరకెక్కించే ఓ సినిమాలో వినాయక్ విలన్ గా నటించనున్నాడని అంటున్నారు. అందుకే దిల్ రాజు నటుడు అని చెప్పారు కానీ హీరో అని చెప్పలేదు అని లాజిక్ చెబుతున్నారు.

More Related Stories