English   

శ్రద్దా శ్రీ నాద్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్

srinath
2019-05-14 21:59:21

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అందరికీ నటన పరంగా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో నటించిన బుడ్డోడి సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో లేడీ లీడ్ గా నటించిన కన్నడ యు ట‌ర్న్ ఫేమ్ శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ కి అయితే ఈ సినిమా దెబ్బకి ఇప్పుడు అన్ని భాష‌ల్లోనూ అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ఆమె తమిళ్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే అయినట్టు చెబుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆమె తాజాగా త‌మిళ హీరో విశాల్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసిందట, విశాల్ ఆర్మీ అధికారిగా న‌టిస్తున్న ఆ సినిమాలో శ్ర‌ద్ధా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందట. ఆమెపై యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఆ పాత్ర కొన్ని నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని అంటున్నారు. ఐత్తే శ్రద్దా పాత్ర పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడంతో ఆమె ఈ సినిమా కోసం బాడీ షెపింగ్ కోసం ఆమె జిమ్ కూడా ప్రారంభించిందట. ఈ సినిమా అభిమన్యుడు సినిమాకి సీక్వెల్ గా ఉండనుందట, అయితే ఈ ఆనంద్ డైరెక్టర్ ఎజిల్ దగ్గర అసిస్టంట్ గా పనిచేసారట. ఆయనే ఈ సినిమా తెరకేక్కుతుందట. ఇక ఈ సినిమాకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు..

More Related Stories