English   

వామ్మో రానా...ఏంటిది ?

rana
2019-05-15 07:56:58

పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవడం అనే అలావాటుని బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్, కోలీవుడ్ లో విక్రమ్ లు బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ తో ప్రేక్షకులను షాక్ కు గురి చేసేవారు.  ఇక ఈ ట్రెండ్ ను బాహుబలి ప్రభాస్, రానాలు టాలీవుడ్ కు అలవాటు చేశారు. రానా ఆ తర్వాత కూడా శరీరాన్ని సినిమాకు తగ్గట్టు మార్చుకుంటూ..  లుక్స్ లో కూడా మార్పులు చూపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం రానా బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న హాథీమేరి సాథీ, అలాగే 1945 అనే సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో రానా బాగా పెరిగిన గెడ్డంతో వయసైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో నీట్‌ షేవ్‌తో కనిపించిన రానా ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఓ అడవి మనిషిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కనున్న విరాటపర్వంలో ఆ తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో హిరణ్యకశ్యప అనే సినిమాలో కూడా యాక్ట్ చేయనున్నాడు. అయితే ఈ పిక్ ఏ సినిమాది అనేది మాత్రం క్లారిటీ లేదు.

More Related Stories