English   

మహర్షి యూనిట్ సాహసం చేస్తోందా ?

Maharshi
2019-05-15 09:55:33

మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. విడుదలైన నాటి నుండి ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మహేష్ ఫ్యాన్స్ ని సైతం షాక్ చేసేలా మరో రెండు మూడు సీన్లు యాడ్ చేయాలని మరి కొన్ని సీన్స్ ను జోడించే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబుకి బాగా నచ్చిన సీన్స్ కొన్ని వున్నాయట. అయితే నిడివి ఎక్కువగా ఉందని ఆ సీన్స్ ను యూనిట్ ట్రిమ్ చేయ్లసి వచ్చిందట. ఇప్పుడు ఆ సీన్స్ ను పూర్తిగా యాడ్ చేస్తారని అంటున్నారు. కామెడీ సీన్స్ ఒకటి, రెండు అలాగే రైతుల కోసం మరో రెండు సీన్స్ యాడ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కారణంగా 10 నిమిషాల నిడివి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. రెండవ వారం మొదటి నుండి కొత్త సీన్స్ ఉంటాయంని చెబుతున్నారు.  ఇప్పటికే నిడివి ఎక్కువైందన్న చర్చ జరుగుతుంటే ఇప్పుడు ఆ సీన్స్‌ని కూడా అతికించి చిత్ర నిడివిని మరింత పెంచే సాహసం చేయబోతోంది మహర్షి యూనిట్. ఈ సాహసం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More Related Stories