English   

ఇస్మార్ట్ టీజర్....నాతో కిరికిరి అంటే...మార్ ముంత చోడ్ చింత !

 Ismart Shankar
2019-05-15 11:39:45

హీరోలను అత్యంత స్టైలిష్ గా చూపించే డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాని పూరీ కనెక్ట్స్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ మీద చార్మీ పూరీ కలిసి నిర్మిస్తున్నారు. రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ లు నటిస్తున్న ఈ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. ఈరోజు రామ్ పుట్టిన రోజు కావడంతో ఆ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో రామ్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకునేలా ఉంది. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ సారి గట్టిగానే కొట్టేట్టు కనిపిస్త్జోంది. రామ్ టీజర్ లో  సరి కొత్త‌ మాడ్యులేషన్ లో హిందీ పదాలలో తన దైన శైలి మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే,,,,మార్ ముంత చోడ్ చింత....నీ అమ్మ అంటూ పూరీ మార్క్ డైలాగ్స్ తో రచ్చ చేశారు రామ్. అలాగే టీజ‌ర్‌ లో ప్ర‌ధానంగా ఆర్ ఆర్ తో పాటు బ్యాగ్రౌండ్ లో వచ్చిన సాంగ్ కూడా చాలా బాగుంది. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా మీద ఈ టీం అంతా ఆశలు పెట్టుకుంది. ఇక ఈ సినిమా మేలోనే రిలీజ్ చేయాలని అనుకున్న అనుకోని అవాంతరాల వలన సినిమా వాయిదా పడింది.

More Related Stories