English   

మహర్షి తర్వాత మరో హిట్ కొట్టిన మహేష్ 

 Mahesh
2019-05-15 14:36:46

ఒక పక్క సినిమాలు మరో పక్క కొన్ని ప్రముఖ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్‌ గా, మరో పక్క నిర్మాణ సంస్థతో మరో పక్క థియేటర్ తో ఇలా ఇన్ని పనులతో బిజీగా ఉన్న మహేష్ కి ఈ మధ్య కాలం బాగా కలిసి వస్తున్నట్టు ఉంది. ఇప్పటికే అయన నటించిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ కాగా తాజాగా ఆయన్ చేసిన యాడ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ మధ్య ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆన్‌లైన్‌ బస్‌ టికెటింగ్‌ సంస్థ అభిబస్‌ కు కొన్ని యాడ్స్ చేశారు. ఆ యాడ్స్‌లో కమెడియన్ వెన్నెల కిషోర్‌తో కలిసి చేసిన ఓ యాడ్ భారతదేశంలోనే ఉత్తమమైన జెడ్‌ఏపీఆర్ ఇండెక్స్ నుండి ఉత్తమ టీవీసీ గా ఎంపికయ్యింది. ఈ కామర్స్ రంగంలో పర్యాటక రంగ విభాగంలో ఉత్తమ టీవీసీగా ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ టీవీసీ(టెలివిజన్ కమర్షియల్)కి ఇండియా ప్రీమియం టెలివిజన్ కంటెంట్ రేటింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీ అయిన 'జెడ్‌ఏపీఆర్' ఇండెక్స్ 2019 ప్రకటించిన రేటింగ్స్‌లో ఉత్తమ స్థానం లభించింది. దర్శకుడు కొరటాల శివ వెన్నెల కిశోర్, సూపర్‌స్టార్ మహేష్‌ బాబులతో కలిసి ఈ టీవీసీ ఈ టీవీసీని రూపకల్పన చేసారు.  

More Related Stories