English   

విశాల్ మంచి వాడు కాదని తెలిసింది...హ్యాపీ అట ?

Vishal
2019-05-15 16:51:13

ఏమయ్యిందో ఏమో కానీ తన పెళ్లి విషయం ప్రకటించిన నాటి నుండి కోలీవుడ్ హీరో విశాల్ కి బ్యాడ్ టైం మొదలయ్యింది. నడిఘర్ సంఘం బాధ్యతలు చేపట్టినన తర్వాత విశాల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో క్రమక్రమంగా అది పోతోంది. 2015వ సంవత్సరంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ మీద తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు విశాల్ ఆ సమయంలో శరత్ కుమార్ కు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల్లో విశాల్ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పలు విషయాల్లో మాజీ అధ్యక్షుడు అయిన శరత్ కుమార్ కు అడ్డు పడి ఈ మధ్య అయితే విశాల్ వల్ల శరత్ కుమార్ జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వస్తుందేమో అనే చర్చ జరిగింది. అయితే ఈ నేపధ్యంలో శరత్ కుమార్ భార్య సీనియర్ నటి రాధిక విశాల్ పై సంచలన వ్యాఖలు చేశారు. విశాల్ పదవి కాలం ముగియడంతో నెక్స్ట్ మరొకసారి నడిఘర్ సంఘం సీటు దక్కించుకోవాలని విశాల్ వర్గం ట్రై చేస్తోంది. మొదటి విశాల్ కి పోటీగా శరత్ కుమార్ సతీమణి రాధిక బరిలో దిగుతారని అనుకున్నారు. అయితే ఆ పదవి కోసం తనకు తన భర్తకు అంత తీరిక లేదని అయినా సరే విశాల్ మంచి వాడు కాదనే విషయం అందరికి తెలియడం నాకు సంతోషంగా ఉందని చెప్పింది. అలాగే విశాల్ కు వ్యతిరేఖంగా ఎవరు నామినేషన్ వేసినా వారికి మా పూర్తి మద్దతు ఇస్తామని ఆమె చెప్పుకొచ్చింది.

More Related Stories