English   

ట్యూషన్ కి ప్రభాస్...అందుకేనట ?

 Prabhas
2019-05-15 17:25:58

‘బాహుబలి’తో అన్ని బాషల ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌ కు నార్త్ ఇండియాలో పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. అయితే ఇక్కడే కొత్త చ చిక్కు వచ్చి పడింది. బాహుబలి హిందీ వెర్షన్‌ కొస ప్రభాస్‌కు ఇతరులచేత డబ్బింగ్ చెప్పించారు. కానీ ఇకపై హిందీలో కూడా ప్రభాస్‌ సొంతంగానే డైలాగులు చెప్పాలని సిద్ధమవుతున్నారు. ప్రభాస్‌కు హిందీలో మంచి పట్టు ఉన్నప్పటికీ, మాట్లాడితే దక్షిణాది యాస అర్ధమైపోతుందట. దీంతో ఉత్తరాది యాస వచ్చేందుకు కొంతమంది దగ్గర ట్యూషన్ పెట్టించుకుని గంటల తరబడి హిందీ డైలాగ్స్ సాధన చేసినట్లు చెబుతున్నారు. తన గొంతులో ఆ యాస పోయిందని తనకు స్పష్టత వచ్చిన తరువాతే సాహో డబ్బింగ్ చెబుతానని ప్రభాస్ చెప్పాడట. ఇక ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కి సిద్దమయ్యింది.

More Related Stories