English   

ఈ ఆమెజాన్ అంత పెద్ద దేబ్బెసిందా మహర్షికి ?

Maharshi
2019-05-15 18:36:47

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బానే రాబడుతున్నా కీలకంగా భావించే ఓవర్సీస్ లో మాత్రం గట్టి దెబ్బే వేసింది. అదేమ విచిత్రమో మహేష్ గత సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా ఈజీగా మిలియన్ డాలర్లు సంపాదించగా ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా రెండు మిలియన్ మార్క్ దాటకపోవడం వెనుక ఒక పెద్ద సమస్యను గుర్తించారు ట్రేడ్ అనలిస్టులు. ఈ సినిమాతో పాటు  ఈమధ్య కాలంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'మజిలీ' 'జెర్సీ' సినిమాలకు కూడ టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ కలక్షన్స్ లో కోతకి కారణం ఆమేజాన్ ప్రైం అని అంటున్నారు. నిజానికి అమెరికా లాంటి చోట్ల ఒక టికెట్ కొనాలంటే యావరేజ్ గా పడి డాలర్లు పడుతుంది అంటే ఆరువండలు, ఒక కుటుంబం చూడాలంటే నలుగురు లేక్కేసుకున్నా మూడువేల దాకా అవుతుంది, అంత ఖర్చు పెట్టె బదులు నాలుగు వారాలు ఓపిక పడితే అమజాన్ ప్రైమ్ లో దాదాపు అన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ సినిమాలను తమ ఇంటిలో అందరూ కలిసి చూడొచ్చు అని భావిస్తున్న నేపధ్యంలో టాప్ హీరోల సినిమాలకు కూడా అక్కడ దెబ్బ పడుతుందని తేల్చారు. నిజానికి గతంలో ఇక్కడ కూడా అదే సమస్య ఏర్పడితే ఆమెజాన్ కొనుకున్న సినిమాని నెల తర్వాత పెట్టుకునేలా చర్యలు తీసుకున్నారు. దాని ఎఫెక్ట్ కి ఇక్కడ కాస్త తెరుకున్నా అక్కడ మాత్రం దేబ్బెసింది అన్నమాట.

More Related Stories