English   

డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్స్ లేవు....ఎవ్వరినీ వదలం ?

drugs
2019-05-15 20:05:32

నిన్నటి నుండి టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అప్పట్లో విచారాణ జరిపిన వారి పేర్లులేకపోవడంతో వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్టే అన్నట్టు ఊహించుకుని కధనాలు రాశాయి మీడియా చానెళ్ళు. దీంతో సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ లో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందికి క్లీన్ చిట్ ఇవ్వలేదని షాకింగ్ విషయాన్ని ప్రకటించింది ఎక్సైజ్ శాఖ. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ పై సుదీర్ఘ విచారణ తరువాత మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్ డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే కేసుల్లో చేర్చింది. సినీ అగ్రతారలు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. రవితేజ, చార్మి, పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. అయితే వీరి ఎవరి పేర్లూ చార్జ్ షీట్ లో లేకపోవడంతో ఈ కేసులో వారదరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని ప్రచారం జరగగా దానిని కొట్టి పారేసింది ఎక్సైజ్ శాఖ. ఈ కేసు విచారణకు  వచ్చిన సినీ సెలబ్రిటీల నుండి గోళ్లు, రక్తం, వెంట్రుకలు కూడా సేకరించారు అధికారులు. ఇక ఆ రిపోర్టులు సైతం వచ్చాయని , డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని ఎక్సైజ్ శాఖాధికారులు చెప్తున్నారు. చూడాలి మరి ఈ దెబ్బకు ఎవరయినా బయటకు వస్తారేమో మరి.

More Related Stories