English   

రష్మి శివరంజని ట్రైలర్ టాక్

rashmi
2019-05-15 21:23:24

ఒకపక్క బుల్లితెర మీద లెక్కలేనన్ని షోలు చేస్తూనే అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేసుకుంటూ పోతోంది హాట్ భామ రష్మీ. ఈ మధ్య కాలంలో అంతకుమించి అంటూ ఒక సినిమాతో అలరించినా అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తాజాగా ఆమె మరో దెయ్యం సినిమాతో మనముందుకు వస్తోంది. నందు, రష్మి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ హారర్ సినిమా శివరంజని. ఈ సినిమా ట్రైలర్‌ ను ఈరోజు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే రష్మికి దెయ్యం పట్టడం దానిని వదిలించేందుకు మాంత్రికురాలు, మరో సైకాలజిస్ట్, ధనరాజ్ తో కాస్త రొటీన్ కామెడీ ఇవన్నీ ‘శివరంజని’ ట్రైలర్‌లో కనిపించిన విజ్యుయల్స్. ఈ కాలంలో కూడా బూతాలు దెయ్యాలు నమ్మడం ఏంటి? అని హీరో అంటే.. నన్ను ఒక నీడ వెంటాడుతోంది.. అది నీడ కాదు ఆత్మ అంటూ వచ్చే డైలాగ్స్ ఈ సినిమా రొటీన్ అనే సిగ్నల్స్ ఇస్తోంది. అయితే ఇక జనాన్ని ఎలా అయినా థియేటర్ కి రప్పించే ప్రయత్నంలో భాగంగా హాట్ హాట్ రొమాన్స్ సీన్లను పండించారు. 

 

More Related Stories