English   

ఏపీ సీఎం వలనే వారి విగ్రహాల తొలగింపు

lakshmi
2019-05-15 21:54:58

విశాఖప‌ట్నంలోని బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఎవరో వ్యక్తి చేసిన ఫిర్యాదు కారణంగా వాటిని తొలగించి నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ విగ్ర‌హాల‌ను మళ్లీ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లు తొలగించారని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆరోపించారు. ఈరోజు ఒక ఛానల్‌తో మాట్లాడిన ఆయన ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, దాసరి కుమారుడు అరుణ్, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడాన్ని సహించలేకే చంద్రబాబు ఇలా చేశారని ఆయన ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను చంద్రబాబుకు చెప్పడంతో ఆయనకీ తన మీదా కోపముందని, ఆ కారణంగానే తన ప్రమేయంతో ఏర్పాటు అయిన ఈ విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. బీచ్ రోడ్డులో మరెందరివో విగ్రహాలున్నా వాటన్నింటినీ వదిలేసి ఈ మూడు విగ్రహాల మీదనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని యార్లగడ్డ ప్రశ్నించారు.  

More Related Stories