English   

ప్రముఖ స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ఏక్ నాథ్ కన్నుమూత

nath
2019-05-15 22:06:48

ప్రముఖ సినీ టెక్నీషియన్ ఏక్ నాథ్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. క్ష్ కంప్యూటర్ లేని రోజుల్లోనే ఆయన స్పెషల్  ఎఫెక్ట్స్ కింగ్ గా ఆయన సినిమా పరిశ్రమంలో పేరుగాంచారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే ఆయన స్పెషల్ ఎఫెక్ట్ లను సృష్టించారు. ఏపిలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఏక్ నాథ్ ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణకు సోదరుడే. 55 ఏళ్ల క్రితమే సినిమాల కోసం మద్రాసు వెళ్ళిన ఆయన అమితాబ్, ఎన్ టిఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ లతో పాటు అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన పని చేశారు. జానపద సినిమాల రూపకర్త విఠలాచార్య సినిమాలకు అప్పట్లోనే ఏక్ నాథ్ అద్భుతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ వాడారు. అంతేకాదు ఇండియాలో మొదటి త్రీడీ సినినిమా మొదలు ఆయన పలు త్రీడి సినిమాలకు ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. తన కెరీర్ లో ఆయన సుమారు 700 సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. ఆయన మృతిపై టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

More Related Stories