English   

చైతూ కోసం కాజల్ అట ?

kajal
2019-05-15 22:17:34

దిల్ రాజు ఇటీవలే నాగచైతన్యతో ఓ సినిమా నిర్మిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఒక కొత్త దర్శకుడు రూపొందిస్తాడట. ఇది ఎమోషనల్ టచ్ ఉన్న లవ్ స్టోరీ అని ఇందులో చైతూ సరసన కాజల్ ఖరారైందని అంటున్నారు. నిజానికి ప్రస్తుతం కాజల్ కెరీర్ ఏమంత ఊపులో లేదు. ఇంతకుముందులా కాకుండా ఆమె చిన్న హీరోలతో కూడా నటిస్తోంది. ఇక చైతూ  తాజాగా ‘మజిలీ’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘వెంకీ మామ’ అనే సినిమా లో తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి 2011లో నాగ చైతన్య, కాజల్ కలిసి ‘దడ’ అనే సినిమాలో నటించారు కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. మరి వీరిద్దరి కాంబినేషన్ ఈ సారైనా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

More Related Stories