English   

అదేంటో గానీ రివర్స్ లో పిచ్చెక్కిస్తోంది ? 

actress
2019-05-16 08:34:35

అందం, అభినయం ఉన్న తారలు కొందరే ఉంటారు. అలాంటి వాళ్లల్లో టబు ఒకరు. షబానా అజ్మి మేనకోడలైన ఈ సుందరికి బిటౌన్లలో ఎంత పేరు వచ్చిందో సౌత్లో కూడా అంతే ఇమేజ్ వచ్చింది. బాలీవుడ్ లో 1980లలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొని నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నెం.1 చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన టబు తర్వాత కృష్ణవంశి దర్శకత్వంలో నాగార్జున నటించిన ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ చిత్రం నిన్నే పెళ్లాడుతా చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.  రీ ఎంట్రీ తర్వాత ఆమె నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తోంది. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ త‌దిత‌ర భాషా చిత్రాల్లో నటించిన టబు వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా కుమారిగానే ఉంటుంది. తాజాగా ఆమె త‌న ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది ఆ ఫోటోలో ఆమె అందం వర్ణించ జాలం అన్త్జ అందంగా ఉందీ ముదురు వయసు నటి. ఇంత వయసు వచ్చినా ఈ ముదురు భామ ఇంకా గ్లామర్ మెయింటేన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వయ‌సు పెరుగుతుంటే ఈమెకు గ్లామర్ కూడా పెరుగుతోంది ఏంటో ?

More Related Stories