English   

తను శ్రీ కి షాక్...సాక్ష్యాలు లేవట ?

 Tanushree
2019-05-16 10:41:29

ప్రస్తుతం అన్ని బాషలలో విస్తృతంగా నడుస్తోంది మీటూ ఉద్యమం. ఆ మధ్య ఎప్పుడో తనను నానా పటేకర్‌ లైంగికంగా వేదించాడు అంటూ బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా ఆయన మీద లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆమెకు షాకిచ్చారు ముంబై పోలీసులు. 2008లో హార్న్‌ ఓకే ప్లీజ్‌ అనే సినిమాలో ఓ ఐటెం సంగ్ చేస్తున్నప్పుడు పటేకర్‌ తన చెయ్యి పట్టుకుని లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించి పోలీసులకి ఫిర్యాదు చేశారు. తనుశ్రీ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన ముంబయి పోలీసులు ఆ సినిమా సాంగ్ షూట్ సమయంలో ఉన్న వారిలో దాదాపు 15 మందిని పోలీసులు విచారించారు. అయితే ఇది ఏళ్ల క్రితం జరిగిన ఘటన కావడంతో ఈ విషయం ఎవరికీ గుర్తులేదని చెప్పారట. ఈ క్రమంలో సాక్ష్యాలేవీ దొరక్కపోవడంతో విచారణ కొనసాగించడం కష్టమవుతోందని పోలీసులు పేర్కొన్నారు. అయితే తనుశ్రీ మాత్రం నిజం చెప్పడానికి కొందరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారనీ కానీ, వారికి బెదిరింపులు వస్తున్నాయని తప్పు చేసిన వారికీ ఎప్పటికైనా శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు ఉందని చెబుతోంది.

More Related Stories