English   

ఆర్ఆర్ఆర్ అభిమానులకి గుడ్ న్యూస్ 

 RRR
2019-05-16 11:02:02

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. హీరోలిద్దరికి స్వల్ప గాయాలవ్వడంతో షెడ్యూల్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం నడిచింది. అయితే ఈ విషయం ఆయా హీరోల ఫ్యాన్స్ ని భయపెట్టింది, అయితే తాజాగా అలాంటిది ఏమీ లేదని వారు మళ్ళీ రీ షెడ్యూల్ చేసుకుని రెడీగా ఉన్నట్టు సమాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ మే 21 నుండి జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఈ షెడ్యూల్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌తో పాటు అలియా భ‌ట్ కూడా షూటింగ్‌లో పాల్గొన‌నుంద‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కొద్ది రోజులు షూటింగ్ జ‌రిపిన త‌ర్వాత యూనిట్ అంతా పూణే వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

More Related Stories