English   

చిరంజీవి, నాగార్జున బాటలోనే ప్రభాస్

 Prabhas
2019-05-16 11:30:03

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో తన ఇమేజ్ నే కాదు తెలుగు సినీమా సత్తాని చాటి చెప్పాడు. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ కి వీపరితమైన ఫ్యాన్స్ బేస్ క్రేజ్ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సాహో, జాన్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. సాహో సినిమాకి ఇప్పటికి చాలా హైప్ వచ్చింది. ఆగష్టు 15వ తేదిన విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు సాహో ప్రొడ్యూసర్స్ అంటే తన చిన్న నాటి మిత్రులు యూవీ క్రియేషన్స్ వంశీ-ప్రమోద్ లతో కలసి ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. మరోపక్క సూళ్లూరుపేట సమీపంలో ప్రభాస్ ఓ భారీ సినిమా థియేటర్ ను నిర్మిస్తున్నారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ తో ఉంటుందట. త్వరలోనే ఈ థియేటర్ ప్రారంభమవుతుందని అంటున్నారు. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీని ప్రారంభించిన వారిలో ఉన్నారు దీంతో ఇప్పుడు ప్రభాస్ వారి దారిలోనే నడవనున్నాడన్న మాట. 

More Related Stories