English   

కమల్ మీద చెప్పు దాడి ?

Kamal Haasan
2019-05-16 13:19:27

రెండ్రోజుల క్రితం కమల్ హాసన్ చేసిన హిందూత్వ తీవ్రవాద వ్యాఖ్యలు ఆయన కొంప ముంచేలా ఉన్నాయి. నిన్న ప్రచారంలో భాగంగా తిరుప్పరంకుండ్రం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు దుండగులు ఆయనపై చెప్పులు వేసి తమ నిరసన తెలిపారు. అయితే కమల్ హాసన్ పై దాడి చేసిన చెప్పుల నుండి ఆయన తప్పించుకున్నాడు. అయితే ఒకరిద్దరు కాకుండా అనేక మంది ఓకే సారి ఇలా దాడి చేయడంతో ఆయన  తన ప్రసంగాన్ని ఆపివేయవలసి వచ్చింది. స్వతంత్ర భారతం లో మొదటి తీవ్రవాది గాంధీని చంపిన హిందు మహా సభ మనిషి  గాడ్సే అని కమల్ వ్యాఖ్యాంచిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ క్రమంలో కొంతమంది హిందువులు కమల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కమల్ అభిమానులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో 10 మీద కూడా కేసులు పెట్టినట్టు సమాచారం. నిజానికి వారిలో బీజేపీతో పాటు హనుమాన్ సేన కార్యకర్తలు కూడా ఉన్నారు.

More Related Stories